
తెలంగాణలోని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న మల్కనూరు వద్ద వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కారును బావి నుంచి వెలికి తీసేందుకు యత్నిస్తున్నారు. కారు నీటిలో పూర్తిగా మునిగిపోయింది. వాహనంలో పలువురు ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. కారు కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వెళ్తుండగా ఘటన జరిగింది. బావిలో నుంచి కారును వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గురైన కారులో ఎంతమంతి ఉన్నారనే విషయం తెలియాల్సి ఉంది.