Telugu News » News » 20 crore people in india will be vaccinated in 130 days
భారత్ లో 130 రోజుల్లో 20 కోట్ల మందికి వ్యాక్సిన్
భారతదేశంలో 130 రోజుల్లో 20 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ అందజేశారు. అమెరికా తర్వాత ఇంత పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ ఇచ్చిన దేశంగా బారత్ నిలిచింది. అమెరికా 20 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వడానికి 124 రోజుల సమయం పట్టింది. 60 ఏండ్ల వయసు పైబడిన జనాభాలో 42 శాతం మందికి మొదటి డోసు ఇచ్చినట్లు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. 18-44 ఏండ్ల లోపు మొత్తం 1.28 కోట్ల మందికి వ్యాక్సిన్ […]
భారతదేశంలో 130 రోజుల్లో 20 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ అందజేశారు. అమెరికా తర్వాత ఇంత పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ ఇచ్చిన దేశంగా బారత్ నిలిచింది. అమెరికా 20 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వడానికి 124 రోజుల సమయం పట్టింది. 60 ఏండ్ల వయసు పైబడిన జనాభాలో 42 శాతం మందికి మొదటి డోసు ఇచ్చినట్లు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. 18-44 ఏండ్ల లోపు మొత్తం 1.28 కోట్ల మందికి వ్యాక్సిన్ మొదటి మోతాదు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.