థర్డ్ వేవ్ వస్తే ఆర్థిక వ్యవస్థ కుదేలే?

కరోనా సెకండ్ వేవ్ భారత వృద్ధి రేటును సవరించింది. ప్రముఖ బ్రిటిష్ బ్రోవరేజీ సంస్థ టార్క్ లేస్, వృద్ధి రేటు అంచనాలను 0.80 శాతం తగ్గించి 9.2 శాతంగా అంచనా వేసింది. మొదటి వేవ్ లో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. దీని నుంచి కోలుకునే క్రమంలో సెకండ్ వేవ్ రానే వచ్చింది. దీనికితోడు వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగడం, పలు రాష్ర్టాలు లాక్ డౌన్ ఆంక్షలు విధించడంతో వృద్ధి రేటు తగ్గడానికి కారణాలుగా చెప్పవచ్చు. […]

Written By: Srinivas, Updated On : May 26, 2021 6:52 pm
Follow us on


కరోనా సెకండ్ వేవ్ భారత వృద్ధి రేటును సవరించింది. ప్రముఖ బ్రిటిష్ బ్రోవరేజీ సంస్థ టార్క్ లేస్, వృద్ధి రేటు అంచనాలను 0.80 శాతం తగ్గించి 9.2 శాతంగా అంచనా వేసింది. మొదటి వేవ్ లో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. దీని నుంచి కోలుకునే క్రమంలో సెకండ్ వేవ్ రానే వచ్చింది. దీనికితోడు వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగడం, పలు రాష్ర్టాలు లాక్ డౌన్ ఆంక్షలు విధించడంతో వృద్ధి రేటు తగ్గడానికి కారణాలుగా చెప్పవచ్చు.

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) గత లలో భారత వృద్ధి రేటు అంచనాలను 10.5 శాతంగా అంచనా వేసింది. బార్క్ లేస్ కూడా 9.2 శాతంగా అంచనా వేసింది. ఆర్థిక నిపుణులు, సంస్థలు భారత జీడీపీ వృద్ధి రేటును 8.5 శాతం నుంచి 10 శాతానికి కాస్త పైన అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులు క్రమంగా అందుబాటులోకి వ స్తున్నాయని, వివిధ రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లాక్ డౌన్, కొత్త కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తున్నట్లు పేర్కొంది.

ఏప్రిల్ నెల నుంచి కరోనా కేసులు రోజుకు 3 నుంచి 4 లక్షల వరకు నమోదయ్యాయి. ఈ సమయంలో రోజుకు 4500 మరణాలు సంభవించాయి. తరువాత క్రమంలో తగ్గుముఖం పట్టాయి. వీటిని లెక్కలోకి తీసుకుంటే బార్క్ లేస్ భారత జీడీపీ వృద్ధి రేటును అంచనా వేసింది. జూన్ చివరి వరకు లాక్ డౌన్ ఇలాగే కొనసాగితే ఆర్థిక వ్యవస్థకు 74 బిలియన్ డాలర్ల ఆర్థఇక నష్టం కలుగుతుందని అంచనా వేస్తున్నారు.

దేశంలో కరోనా మూడో వేవ్ ప్రారంభం అయితే భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోలేదని పేర్కొంది. ఒకవేళ థర్డ్ వేవ్ ఉంటే మరో ఎనిమిది వారాల పాటు లాక్ డౌన్ విధిస్తే ఆర్థిక వ్యవస్థపై మరింత భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వృద్ధి రేటు మరింత తగ్గిపో యి 7.7 శాతంగా ఉంటుందని చెబుతున్నారు.