ప్రియుడికి బ్రేకప్ చెప్పిన మాజీ విశ్వసుందరి !

గత కొన్ని నెలలుగా మాజీ విశ్వసుందరి ‘సుస్మిత సేన్‌’, తన యంగ్ బాయ్‌ ఫ్రెండ్‌ ‘రోహ్మాన్ షాల్‌’తో బ్రేకప్ చెప్పుకుందని ఇప్పటికే అనేక రకాలుగా పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఈ వార్త పై ఎలాంటి క్లారిటీ లేదు. కానీ గత కొన్నిరోజులుగా ‘సుస్మిత సేన్‌’ వరుస పోస్ట్ ల సారాంశం కూడా మొత్తానికి ఇదే నిజం అని చెబుతుంది. తాజాగా రోహ్మాన్‌ ఇన్‌ స్టా స్టోరీలను చూస్తుంటే వీరి ప్రేమాయణంకి ముగింపు పడింది అని అర్థమవుతుంది. […]

Written By: admin, Updated On : May 26, 2021 7:01 pm
Follow us on


గత కొన్ని నెలలుగా మాజీ విశ్వసుందరి ‘సుస్మిత సేన్‌’, తన యంగ్ బాయ్‌ ఫ్రెండ్‌ ‘రోహ్మాన్ షాల్‌’తో బ్రేకప్ చెప్పుకుందని ఇప్పటికే అనేక రకాలుగా పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఈ వార్త పై ఎలాంటి క్లారిటీ లేదు. కానీ గత కొన్నిరోజులుగా ‘సుస్మిత సేన్‌’ వరుస పోస్ట్ ల సారాంశం కూడా మొత్తానికి ఇదే నిజం అని చెబుతుంది.

తాజాగా రోహ్మాన్‌ ఇన్‌ స్టా స్టోరీలను చూస్తుంటే వీరి ప్రేమాయణంకి ముగింపు పడింది అని అర్థమవుతుంది. గత కొన్నేళ్లుగా సుస్మిత, రోహ్మాన్‌ జంట లివింగ్‌ రిలేషన్‌ షిప్‌‌ లో అడ్డు అదుపు లేకుండా ప్రేమ మైకంలో మునిగితేలింది. అయితే బుధవారం రోహ‍్మాన్‌ ఇన్‌ స్టాలో ఆస్క్‌ మీ ఎనిథింగ్‌ సెషన్‌ ను నిర్వహించి ముదురుభామతో తన ప్రేమ గురించి కూడా ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు.

ఓ నెటిజన్ ‘సెలబ్రెటీ హోదాను ఎంజాయ్‌ చేస్తున్నారా ? ఆ హోదా కారణంగా స్వేచ్చ కోల్పోవాల్సి వస్తుంది కదా. ఎలా ఫీల్‌ అవుతున్నారు ? అని ఓ అభిమాని క్వశ్చన్ చేయగా.. రోహ‍్మాన్‌ మాట్లాడుతూ వాస్తవం మాట్లాడుకుంటే నేను ఇంకా నాకు నేనుగా సెలబ్రిటీ హోదాను సంపాదించలేదు. అది వేరే వ్యక్తి కృషి వల్ల వచ్చిందని ఇన్ డైరెక్ట్ గా సుస్మితను ఉద్దేశించి చెప్పాడు.

అలాగే ఇంకా మాట్లాడుతూ… ఏదో ఒకరోజు నేను కూడా ఆ వ్యక్తి స్థాయికి చేరుకుంటాననే నమ్మకం నాకుంది’ అంటూ సమాధానం చెప్పాడు. ఇక సుస్మిత సేన్‌ గురించి ఏమి చెబుతారు ? అడగగా.. ‘ఆమెకేంటి చాలా ఉత్తమైనది’ అంటూ బదులిచ్చాడు. అయితే, సుస్మిత ఈ రోజు ఒక పోస్ట్ పెట్టింది. తనకు 45 ఏళ్ళు వచ్చాక కూడా.. తన ఎంపికలో ఓ పొరపాటు చేశానంటు ఇన్‌స్టాలో మెసేజ్ పెట్టింది. ఈ మెసేజ్ రోహ్మాన్‌ గురించే అని క్లారిటీగా అర్ధమవుతుంది.