1997Movie: నవీన్ చంద్ర హీరోగా డా. మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 1997. ఇందులో మోహన్ కూడా నటించారు. వీరితో పాటు శ్రీకాంత్ అయ్యంగార్, కోటి కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ నెల 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన దర్శకుడు మోహన్.. సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఒక దొర అహంకారానికి బలైన అమాయకురాలి కథే ఈ 1997 అని తెలిపారు.

తమ తాతగారు 1997లో జరిగిన వాస్తవ ఘటనలను తన కళ్లకు కట్టినట్లు చెప్పేవారని.. వాటి స్ఫూర్తితోనే ఈ కథను సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు మోహన్. అత్యాచారానికి గురైన ఓ మహిళ పడే మానసిక వేదన, ముఖ్యంగా ఆమె తల్లి భావోద్వేగాలను ఈ సినిమాలో సున్నితంగా చూపించినట్లు పేర్కొన్నారు.
Also Read: ప్రభాస్ రెమ్యునరేషన్ తో ఎన్టీఆర్, మహేష్, పవన్ లతో మూడు సినిమాలు చేయవచ్చు!
ఇది తన తొలి సినిమా అయినప్పటికీ.. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా ఇదంతా రిస్కుతో కూడుకున్న పనని తెలిపారు. కానీ, వేరే దారి లేక ఇంత రిస్క్ చేస్తున్నాని మోహన్ అన్నారు. తన సినిమాలో తానే నటుడిగా కనిపించడం సంతృప్తిగా ఉందని అన్నారు. కోటి సంగీతం, నేపథ్య గీతం సినిమాకు మంచి హైప్‌ను తెచ్చి పెడతాయని అన్నారు.
ఇటీవల కాలంలో వాస్తవ ఘటనలకు దగ్గరగా వస్తున్న చిత్రాలు ఎక్కువయ్యాయి. బయోపిక్‌లతో పాటు, జరిగిన చిన్న సన్నివేశాన్ని బేస్ చేసుకుని.. పెద్ద కథను అల్లుకుని వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. మొన్న వచ్చిన జై భీమ్ సినిమా కూడా అంతే.. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో తెలియాల్సి ఉంది.
Also Read: ఎన్టీఆర్ ఆశ నెరవేరుతుందా ? లేదా ?