
ఫైజర్ కంపెనీ కోవిడ్ వ్యాక్సిన్‌ను అత్యవసరంగా వినియోగించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ క్లియరెన్స్ ఇచ్చింది. డబ్ల్యూహెచ్‌వో ఆమోదంతో ఇక పేద దేశాల్లోనూ ఈ టీకా అందుబాటులోకి రానున్నాయి. ఫైజర్-బయెఎన్‌టెక్ సంస్థ రూపొందించిన కరోనా వైరస్ టీకాకు బ్రినట్, అమెరికా దేశాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. సాధారణంగా ఆయా దేశాల్లో ఉన్న డ్రగ్ రెగ్యూలేటరీ సంస్థలు.. టీకాలకు ఆమోదం ఇస్తుంటాయి. కానీ పేద దేశాలు చాలా వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదంపై ఆధారపడి ఉంటాయి. ఫైజర్-బయోఎన్‌టెక్ టీకాను అతి శీతల ఉష్ణోగ్రతల్లో స్టోర్ చేయాల్సి ఉంటుంది. మైనస్ 70 డిగ్రీల టెంపరేచర్‌లో ఫైజర్ వ్యాక్సిన్‌ను నిల్వ చేయాలి. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇలాంంటి నిల్వ చేసే కోల్డ్ స్టోరేజ్‌ల కొరత ఉన్నది.