
భూమి, గాలి, సముద్రంలో ఎక్కడైనా సరే శత్రు దేశాల నుండి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ స్పష్టం చేశారు. దేశ భద్రత విషయంలో భారత సైన్యం రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు. లడఖ్ విషయంలో పొరుగు దేశమైన చైనాతో ఏర్పడ్డ ప్రతిష్టంభన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. టిబెట్ అటామనస్ రీజియన్‌లో చైనా కొన్ని అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టడంతో లడఖ్‌లో ప్రతిష్టంభన నెలకొందని, అయితే ప్రతి దేశం దాని వ్యూహాత్మక ప్రయోజనాల నిమిత్తం తన భద్రతను మెరుగుపర్చుకునేందుకు సన్నద్దమౌతూనే ఉంటుందని అన్నారు.