spot_img
Homeజాతీయం - అంతర్జాతీయంPakistan vaccine crisis: పాకిస్తాన్‌లో వ్యాక్సిన్‌ సంక్షోభం.. ఇండియాతో పెట్టుకుంటే అంతే మరి!

Pakistan vaccine crisis: పాకిస్తాన్‌లో వ్యాక్సిన్‌ సంక్షోభం.. ఇండియాతో పెట్టుకుంటే అంతే మరి!

Pakistan vaccine crisis: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ.. భారత్‌పై దాడి చేసేలా ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌కు భారత్‌ ఎప్పటికప్పుడు బుద్ధి చెబుతోంది. పెద్ద నోట్ల రద్దు నుంచి పాకిస్తాన్‌కు షాక్‌లు ఇవ్వడం ప్రారంభించిన మోదీ.. గతేడాది పహల్గాం దాడి తర్వాత దాయాది దేశాన్ని దెబ్బమీద దెబ్బ కొడుతున్నారు. 1969 నాటి సిందూ జలాల ఒప్పందాన్ని హోల్డ్‌లో పెట్టారు. ఇక ఆపేషన్‌ సిందూర్‌తో పాకిస్తాన్‌ను చావుదెబ్బ కొట్టారు. ఇప్పటికీ పాకిస్తాన్‌ భారత దాడిలో దెబ్బతిన్న తన ఎయిర్‌ బేస్‌లకు మరమ్మతులు చేసుకుంటోంది. ఇక తాజాగా వ్యాక్సిన్‌ సబ్సిడీ ఎత్తేయబోతోంది. 1.2 బిలియన్‌(రూ.10 వేల కోట్ల) దిగుమతి భారం పడనుంది. దీంతో పాకిస్తాన్‌ వైద్య శాఖ మంత్రి ముస్తఫా కమల్‌ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు.

GAVI కీలక నిర్ణయం..
ప్రస్తుతం పాకిస్తాన్‌కు సరఫరా అయ్యే వ్యాక్సిన్‌ ఖర్చులో 49 శాతం గావి భరిస్తోంది. మిగిలింది పాక్‌ ప్రభుత్వం భరిస్తోంది. 2030–31 నాటికి గావి సహాయం పూర్తిగా ఆగిపోతుంది. స్వదేశంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి లేకపోవడం, భారత్‌పై ఆధారపడాల్సి రావడంతో పూర్తి ఖర్చును భారత్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా, దిగుమతి బిల్‌ భారీగా పెరిగి, ఆర్థిక వ్యవస్థపై భారం పడనుంది.

భారత్‌ గ్లోబల్‌ వ్యాక్సిన్‌ దిగ్గజం
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ ఉత్పాదక దేశం భారత్‌. గావి సరఫరాలో 60% భాగస్వామి. సీరం ఇనిస్టిట్యూట్, భారత్‌ బయోటెక్‌ వంటి సంస్థలు పీవీసీ, మలేరియా వ్యాక్సిన్లలో కీలకం. భారత్‌ సరఫరా ఆగిపోవడం పాకిస్థాన్‌కు పెద్ద దెబ్బ.

భయానక ఆరోగ్య గణాంకాలు..
ప్రపంచ వ్యాప్తంగా పోలియో దాదాపు అంతమైంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లో మాత్రమే ఇంకా కేసులు నమోదవుతున్నాయి. ఇక గత మూడేళ్లలో మీజిల్స్‌ కేసులు 1.31 లక్షలకు చేరాయి. 2026లోనే 17,000+ కేసులు డబ్ల్యూహెచ్‌వో పరిమితి మించాయి. చిన్నారుల్లో న్యూమోనియా (91,000 మరణాలు/వర్షం), డయేరియా (53,000 మరణాలు) సంభవించాయి. టీకాలు అందకమోతే పరిస్థితి భయానకంగా మారుతుంది.

మిలటరీకే ప్రాధాన్యం..
పాకిస్తాన్‌ ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసింది. నిధుల్లో ఎక్కువగా మిలటరీకే ఖర్చు చేస్తోంది. భారత వ్యతిరేకతపైనే ప్రధాని షెహబాజ్‌ షరీఫ్, ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిమ్‌ మునీర్‌ దృష్టి పెడుతున్నాయి. వ్యాన్సినేషన్‌ సమస్యను కనీసం పట్టించుకోవడం లేదు. విద్య, వైద్యానికి కేటాయించిన నిధులను కూడా ఇతర రంగాలకు మళ్లిస్తున్నారు. దీంతో పాకిస్తాన్‌లోని 47.6 మిలియన్‌ మంది పేదల ఆరోగ్యాన్ని ప్రమాదంలోని నెడుతున్నారు.

వ్యాక్సిన్‌ సంక్షభం నుంచి బయటపడాలంటే పాకిస్తాన్‌ స్థానిక ఉత్పత్తి పెంచుకోవాలి. మిస్‌ఇన్‌ఫర్మేషన్‌ను అరికట్టాలి. భారత్‌ వంటి మోడల్‌ అవలంబించి, ఆరోగ్యాన్ని ప్రాధాన్యం చేస్తే సంక్షోభం నివారించవచ్చు. లేకపోతే ప్రజారోగ్యానికి పెను ముప్పు తప్పదు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version