spot_img
Homeబిజినెస్OnePlus mobile: Oneplus నుంచి కొత్త ఫోన్.. చూస్తే వెంటనే కొంటారు.. ధర బడ్జెట్ లోనే..

OnePlus mobile: Oneplus నుంచి కొత్త ఫోన్.. చూస్తే వెంటనే కొంటారు.. ధర బడ్జెట్ లోనే..

OnePlus mobile: ప్రస్తుత కాలంలో చాలామంది మొబైల్ కొనే సమయంలో కెమెరా పని తీరును ఎక్కువగా గమనిస్తున్నారు. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కోసం.. సోషల్ మీడియా కంటెంట్ సృష్టించడానికి కెమెరా కచ్చితంగా అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో కంపెనీలు సైతం ప్రత్యేకంగా కెమెరా ను దృష్టిలో ఉంచుకొని మొబైల్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఇందులో భాగంగా Oneplus కంపెనీ లేటెస్ట్ గా కొత్త మొబైల్ ను మార్కెట్లో రిలీజ్ చేసింది. ఇందులో క్వాలిటీ స్నాప్స్ వచ్చే కెమెరాతో పాటు మెరుగైన సామర్థ్యం ఉండే బ్యాటరీని చేర్చారు. ఈ మొబైల్ ధర కూడా అందుబాటులోనే ఉంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.

One Plus కంపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చే కొత్త ఫోన్ డిజైన్ ఆకర్షణీయంగా ఉంది. దీనికి నాణ్యమైన గ్లాస్ తోపాటు మెటల్ ఫ్రేమ్ ను అమర్చారు. బ్యాక్ సైడ్ కెమెరా సెట్ అప్ ఇంటిగ్రేటెడ్ చేయబడింది. అందంలో ఏమాత్రం రాజీ పడకుండా లేటెస్ట్ లుక్ తో డిజైన్ చేశారు. పూర్తిగా స్టైలిష్ గా ఉండే విధంగా ఫ్రేమ్ ను అందంగా తీర్చిదిద్దారు. ఇందులో కెమెరా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎందుకంటే 200 MP మెయిన్ కెమెరా ఉండడంతో కావలసిన ఫోటోగ్రఫీని తీసుకోవచ్చు. ఇది హై రిజల్యూషన్ తో కూడిన ఫోటోలను అందిస్తుంది. అలాగే ఇందులో ఆల్ట్రా వైడ్ తో పాటు మాక్రో లెన్స్ కూడా ఉండడంతో ఏఐ తరహాలో ఫోటోలను తీసుకునే అవకాశం ఉంటుంది. తక్కువ కాంతి సమయంలో కూడా అద్భుతమైన ఫోటోలు అందుతాయి. సెల్ఫీ తో పాటు వీడియో కాలింగ్ కోసం కూడా ఫ్రంట్ కెమెరా కావాల్సిన resolution nu అందిస్తుంది. సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

ఈ మొబైల్లో బలమైన బ్యాటరీ ఉండనుంది. ఇందులో 7000 mAh మెరుగైన బ్యాటరీని చేర్చారు. రోజువారి వినియోగదారులతో పాటు గంటలకొద్దీ మొబైల్స్ వాడేవారికి ఈ బ్యాటరీ అనుగుణంగా ఉంటుంది. అలాగే దీనికి ఫాస్టెస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేయడంతో వెంటనే చార్జింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. బిజీగా ఉండేవారు త్వరగా చార్జింగ్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ మొబైల్లో 5G కనెక్టివిటీ వేగవంతంగా ఉంటుంది. ఎటువంటి ప్రదేశంలోకి వెళ్లినా కూడా వెంటనే కనెక్ట్ అయ్యే విధంగా ఇందులో సాఫ్ట్వేర్ను అమర్చారు. గేమింగ్ తో పాటు నెట్ ఫ్లిక్స్ వంటి సినిమాలు చూడాలని అనుకునేవారు ఈ సాఫ్ట్వేర్ ను ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో ఆప్టిమైజ్ చేసిన సాఫ్ట్వేర్ ఉండడంతో ఒకేసారి పలు రకాల యాప్స్ వాడినా కూడా మొబైల్ వేగం తగ్గకుండా ఉంటుంది. ఈ మొబైల్ మార్కెట్లో ప్రస్తుతం రూ.23,999 ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version