US Tariffs On India: భారత్ నా మిత్ర దేశం అన్నాడు. మోడీ నాకు అత్యంత సన్నిహిత మిత్రుడని చెప్పాడు. భారత్ శాంతియుత దేశమని.. అద్భుతమైన చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతమని కొనియాడాడు. అంతేకాదు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రచార సమయంలో నరేంద్ర మోడీని తన దగ్గరికి పిలిపించుకున్నాడు. ఏకంగా హౌడి మోడీ అనే ప్రోగ్రాం నిర్వహించాడు. అటువంటి ట్రంప్ ఇప్పుడు తన అసలు బుద్ధిని చూపించాడు.. భారతదేశం మీద సుంకాల మోత మోగించాడు. కేవలం మన దేశం మీద మాత్రమే కాకుండా.. ప్రపంచ దేశాల మీద సుంకాలను ప్రయోగించాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.
Also Read: చంద్రబాబు సింగపూర్ టూర్ పై పెద్దిరెడ్డి ‘పెద్ద’ కుట్ర?
మిగతా దేశాల సంగతి ఏమోగాని.. భారత్ మీద అమెరికా అధ్యక్షుడు సుంకాలు విధించడానికి కొన్ని కారణాలను విశ్లేషకులు చెబుతున్నారు. ఇందులో ప్రధానమైనది ఉక్రెయిన్ దేశంపై రష్యా 2022లో యుద్ధానికి దిగడమే. ఆ యుద్ధానికి దిగిన సందర్భంలో అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు రష్యా నుంచి ముడిచమురు దిగుమతి చేసుకోవడం నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో రష్యా భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే తక్కువ ధరకు భారతి ఆయిల్ కొనుగోలు చేసింది. గతంలో రష్యా నుంచి భారత్ 16% ఆయిల్ దిగుమతి చేసుకునేది. ఇప్పుడు అది 36.8 శాతానికి పెరిగింది. ఒకప్పుడు ఓపెక్ దేశాలు మనకు ఆయిల్ ఎక్కువగా సరఫరా చేసేవి. ఇప్పుడు ఆస్థానాన్ని రష్యా ఆక్రమించింది. ప్రదేశానికి అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా ఆవిర్భవించింది.
రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేయడమే అమెరికా అసలు కోపానికి కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పైగా ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధంలో భారత్ ప్రేక్షక పాత్రకు పరిమితమైంది. ఉక్రెయిన్ దేశాన్ని భారత్ విమర్శించలేదు. అలాగని రష్యాకు వంత పడలేదు. కేవలం భారత్ తన ప్రయోజనాలకు అనుగుణంగా మాత్రమే నడుచుకుంది. ఇది ట్రంప్ కోపానికి కారణమని విశ్లేషకులు అంటున్నారు. అందువల్లే మన దేశం మీద సుంకాల మోత మోగించడాని చెబుతున్నారు. ప్రపంచం ఏమైపోయినా పర్వాలేదు.. అమెరికా ప్రయోజనాలు మాత్రమే తనకు ముఖ్యమనే తీరుగా ట్రంప్ వ్యవహార శైలి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. అందువల్లే రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంటే.. తన అక్కసు మొత్తాన్ని భారత్ మీద ప్రదర్శిస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ట్రంప్ భారత్ మీద విపరీతమైన కడుపు మంట పెంచుకున్నాడని.. దానిని ఇలా వెల్లదీస్తున్నాడని విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ట్రంప్ తను చేసిన తప్పును గుర్తిస్తాడని.. దానిని సవరించుకునే ప్రయత్నం చేస్తాడని విశ్లేషకులు అంటున్నారు.