Vijay Sethupathi Puri Film: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh)… ఒకప్పుడు ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా సినిమా కోసం ఎదురుచూసే వాళ్ళు అలాంటి పూరి జగన్నాథ్ గత కొన్ని సినిమాల నుంచి తన పూర్తి ఫామ్ ను కోల్పోయాడు. ఒక సక్సెస్ ని సాధించడానికి తీవ్రమైన ప్రయత్నాలైతే చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టినప్పటికి ఇప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఏర్పడింది…ఇప్పటి వరకు కమర్షియల్ సబ్జెక్టులను ఎంచుకొని సినిమాలు గా చేస్తూ వచ్చిన ఆయన ఇప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్ ను సినిమాగా చేయాలనే ఉద్దేశ్యంతో విజయ్ సేతుపతితో కలిసి ఒక డిఫరెంట్ కథ తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం మొదట వేరే హీరోని అనుకున్నారట. కానీ ఆ హీరో రిజెక్ట్ చేయడంతో విజయ్ సేతుపతి దగ్గరికి స్క్రిప్ట్ అయితే వెళ్ళింది. ఇక విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమా రీసెంట్ గా సెట్స్ మీదకి వచ్చింది…అయితే పూరి జగన్నాథ్ ఈ సినిమాని మొదట తమిళ్ స్టార్ హీరో అయిన ధనుష్ తో చేయాలని అనుకున్నాడట.
Also Read: ‘మయసభ’ ట్రైలర్ లో అసలు నాయకుడు ఎవరో చూపించారా..?
కానీ ప్రస్తుతం ధనుష్ డేట్స్ ఖాళీగా లేకపోవడం వల్ల ఆయన ఈ కథను రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. దాంతో పూరి విజయ్ సేతుపతి తో ఈ సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని సాధించాలనే ఒక కసితో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…తొందరగా ఈ సినిమాని కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఒక దృఢ సంకల్పంతో ఆయన తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు.
విజయ్ సేతుపతి కూడా దానికి సహకరిస్తున్నట్టుగా తెలుస్తోంది.. చూడాలి మరి ఈ సినిమాతో పూరి జగన్నాథ తన పూర్వ వైభవాన్ని సంపాదించుకుంటాడా లేదా అనేది… గతంలో ఆయన చేసిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ రెండు సినిమాలు కూడా ఆశించిన మేరకు విజయాలను సాధించలేకపోయాయి… మరి ఈ సినిమాతో అయిన సక్సెస్ ని సాధించి స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే స్థాయికి ఎదుగుతాడా? లేదంటే మీడియం రేంజ్ హీరోలతోనే సరిపెట్టుకుంటాడా?
Also Read: మహేష్ బాబు – రాజమౌళి మూవీలో ఆ ఒక్క సీన్ హైలెట్ అంట..!
అనేది తెలియాల్సి ఉంది. ఒకప్పుడు ఆయన చాలా మంది స్టార్ హీరోలతో కలిసి వర్క్ చేశాడు. కానీ ప్రస్తుతం ఆయన ఫ్లాప్ ల్లో ఉండటం వల్ల ఏ స్టార్ హీరో కూడా అతనికి అవకాశాలనైతే ఇవ్వడం లేదు. కాబట్టి ఇప్పుడు తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకొని పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు…