
టిబెట్‌పై ఆధిపత్యం చలాయించే చైనాకు అమెరికా గట్టి ఝలక్ ఇచ్చింది. ఆధ్యాత్మిక నేతకు వారసుడి ఎంపికలో టిబెటన్ల హక్కులను అమెరికన్ కాంగ్రెస్ సమర్థించింది. టిబెటన్ పాలసీ అండ్ సపోర్ట్ యాక్ట్, 2020ని ఆమోదించి, టిబెటన్లలో సంతోషాన్ని నింపడంతోపాటు, చైనాకు ఆగ్రహం తెప్పించింది. ప్రవాస టిబెట్ ప్రభుత్వం అమెరికా చర్యను స్వాగతించింది. ఇది చరిత్రాత్మకమని, చైనాకు గట్టి సందేశమని అభివర్ణించింది. టిబెట్ ప్రధాన నగరం లాసాలో అమెరికన్ కాన్సులేట్‌ను ఏర్పాటు చేయాలని అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించిన బిల్లు ప్రతిపాదించింది. దలై లామాకు వారసుడిని ఎంపిక చేసుకోవడానికి టిబెటన్లకు సంపూర్ణ హక్కులు ఉన్నట్లు పేర్కొంది.