https://oktelugu.com/

పవన్ ఫ్యాన్స్ కి థమన్ పూనకాలు తెప్పిస్తాడట

అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ పై టాలీవుడ్ లో చాలా కాలం చర్చ నడిచింది. ఈ మలయాళ మల్టీస్టారర్ లో నటిస్తున్నారంటూ బాలకృష్ణ, రానా, వెంకటేష్ లతో పాటు కొందరు టాప్ స్టార్స్ పేర్లు వినిపించాయి. అందరినీ ఆశ్చర్యపరుస్తూ పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్ట్ ని ఓకే చేశారు. ఈ చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ, పవన్ ని ఒప్పించడం జరిగింది. ఐతే పవన్ అయ్యప్పనుమ్ కోశియుమ్ ప్రాజెక్ట్ చేయడం వెనుక దర్శకుడు త్రివిక్రమ్ హస్తం ఉందని టాక్. […]

Written By:
  • admin
  • , Updated On : December 22, 2020 / 07:12 PM IST
    Follow us on


    అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ పై టాలీవుడ్ లో చాలా కాలం చర్చ నడిచింది. ఈ మలయాళ మల్టీస్టారర్ లో నటిస్తున్నారంటూ బాలకృష్ణ, రానా, వెంకటేష్ లతో పాటు కొందరు టాప్ స్టార్స్ పేర్లు వినిపించాయి. అందరినీ ఆశ్చర్యపరుస్తూ పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్ట్ ని ఓకే చేశారు. ఈ చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ, పవన్ ని ఒప్పించడం జరిగింది. ఐతే పవన్ అయ్యప్పనుమ్ కోశియుమ్ ప్రాజెక్ట్ చేయడం వెనుక దర్శకుడు త్రివిక్రమ్ హస్తం ఉందని టాక్. త్రివిక్రమ్ కి నాగవంశీ అత్యంత సన్నిహితుడు కాగా, పవన్ ని త్రివిక్రమ్ ఒప్పించాడని సమాచారం. అలాగే ఈ మూవీ కథలో కీలమైన మార్పులు చేసిన త్రివిక్రమ్, మాటలు సమకూర్చారట.

    Also Read: విన్నర్, రన్నర్ ని బకరాలను చేసిన సోహెల్

    కాగా అయ్యప్పనుమ్ కోశియుమ్ మూవీకి సంగీతం సమకూర్చే బాధ్యత థమన్ కి అప్పగించారు. పవన్ వీరాభిమాని అయిన థమన్ ఆయన కోసం అద్భుతమైన ట్యూన్స్ సిద్ధం చేస్తున్నాడట. ముఖ్యంగా బీజీఎమ్ పై ప్రత్యేక శ్రద్ద పెట్టనున్నారట. కథలో పవన్ పాత్ర ఎలివేషన్ ఓ రేంజ్ లో ఉండనుండగా… దానికి తగ్గట్టుగా బీజీఎమ్ ఉండేలా థమన్ ట్యూన్స్ చేస్తున్నారట. బీజీఎమ్ కంపోజ్ చేయడంలో తనకు తిరుగులేదని నిరూపించుకున్న థమన్, పవన్ కోసం గూస్ బంప్స్ కలిగేలా కంపోజ్ చేస్తారనడంలో సందేహం లేదు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రానికి కూడా థమన్ సంగీతం అందిస్తున్నారు.

    Also Read: ఇండస్ట్రీలో ఉండాలంటే ఏం చెయ్యాలో చెప్పిన పూజ హెగ్డే

    ఇప్పటికే ఈమూవీ నుండి ”మగువా మగువా…’ సాంగ్ విడుదల కాగా విశేషంగా ఆకట్టుకుంది. పవన్ పాత్ర రీత్యా వకీల్ సాబ్ లో భారీగా ఎలివేట్ చేసే మాస్ బీజీఎమ్ ఉండదు. కానీ అయ్యప్పనుమ్ కోశియుమ్ మూవీలో మాత్రం పవన్ మాస్ రోల్ ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేసుకోవచ్చు. కాబట్టి థమన్ తన టాలెంట్ మొత్తం ఉపయోగించి, ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించడం ఖాయమని అంటున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో అల వైకుంఠపురంలో మూవీకి థమన్ కంపోజ్ చేసిన సాంగ్స్ ఎంత పెద్ద ప్రభంజనమో తెలిసిందే. అల వైకుంఠపురంలో సాంగ్స్ కి బాలీవుడ్ కూడా స్టెప్స్ వేసింది. ఇక యూట్యూబ్ లో ఈ సాంగ్స్ భారీ రికార్డ్స్ సెట్ చేశాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్