రైతులతో కలిసి కేంద్ర మంత్రుల లంగర్ భోజనం

గురుద్వారాల్లో కల్పించే ఉచిత భోజనాన్ని లంగర్ అంటారు. ఇవాళ ఇద్దరు కేంద్ర మంత్రులు మధ్యాహ్నం ఆ భోజనం చేశారు. రైతులతో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన చర్చల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. ఇప్పటి వరకు ఆరు సార్లు రైతులు, కేంద్ర మంత్రుల మధ్య చర్చలు జరిగాయి. కానీ అయిదు సార్లు మంత్రులు ఆ భోజనాన్ని స్వీకరించేందుకు నిరాకరించారు. ప్రభుత్వం ఇచ్చిన విందును కూడా రైతుల తిరస్కరిస్తూ వచ్చారు. వారు తెచ్చుకున్న స్వంత ఆహారాన్ని మాత్రమే రైతులు […]

Written By: Velishala Suresh, Updated On : December 30, 2020 5:47 pm
Follow us on

గురుద్వారాల్లో కల్పించే ఉచిత భోజనాన్ని లంగర్ అంటారు. ఇవాళ ఇద్దరు కేంద్ర మంత్రులు మధ్యాహ్నం ఆ భోజనం చేశారు. రైతులతో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన చర్చల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. ఇప్పటి వరకు ఆరు సార్లు రైతులు, కేంద్ర మంత్రుల మధ్య చర్చలు జరిగాయి. కానీ అయిదు సార్లు మంత్రులు ఆ భోజనాన్ని స్వీకరించేందుకు నిరాకరించారు. ప్రభుత్వం ఇచ్చిన విందును కూడా రైతుల తిరస్కరిస్తూ వచ్చారు. వారు తెచ్చుకున్న స్వంత ఆహారాన్ని మాత్రమే రైతులు తినేవాళ్లు. కానీ ఇవాళ కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్‌, సోమ్ ప్రకాశ్‌లో.. రైతుల ఆహ్వానం మేరకు లంగర్ భోజనం చేశారు. కేంద్రం కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు కొన్నాళ్లుగా ఢిల్లీలో ధర్నా చేస్తున్న విషయం తెలిసిదే. ఆ ఆందోళనలను విరమింపచేసేందుకు కేంద్రం, రైతుల మధ్య చర్చలు జరుగుతున్నాయి.