ఢిల్లీలోని ఓ ఫ్యాక్టరీ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఊపిరాడక ఇద్దరు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని ఖుర్జా ప్రాంతానికి చెందిన ఇద్రీస్, సలీంలు ఢిల్లీలోని అజాద్‌పుర ప్రాంతలో ఉన్న ఓ ఫ్యాక్టిరీకి చెందిన సెప్టిక్ ట్యాంక్‌ను క్లీన్ చేస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని బీజేఆర్‌ఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్రీస్, సలీంలు సోమవారం మృతి చెందారు. మరో ముగ్గురు అబ్దుల్ సద్దాం, సలీమ్, మన్సూర్‌లు చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనలో ప్యాక్టరీ ఓనర్ రాజేందర్ సోని, కాంట్రాక్టర్ ప్రమోద్‌దంగిని పోలీసులు అరెస్టు చేశారు.