తమిళంతో పాటు తెలుగులో కూడా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతన్న హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ మరో థ్రిల్లర్ మూవీతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అవుతున్నారు. “భూమిక” అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ థిల్లర్ ఐశ్వర్య రాజేశ్ కి 25వ సినిమా కావడం విశేషం. మిల్కీబ్యూటీ తమన్నా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు.
Also Read: విస్వక్ షేన్ చేతుల మీదుగా “చెప్పినా ఎవరూ నమ్మరు” ఫస్ట్ లుక్
ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు సమర్పిస్తున్నారు. స్టోన్ బెంచ్ ఫిల్మ్, ప్యాషన్ 8 స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గతంలో ఈ బ్యానర్ ద్వారా కీర్తి సురేశ్ హీరోయిన్ నటించిన పెంగ్విన్ చిత్రం విడుదలైంది. కార్తికేయన్ సంతానమ్, సుధాన్ సుందరమ్, జయరామన్ ఈ సినిమాను నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రతీంద్రన్ ఆర్ ప్రసాద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ప్రేక్షకుల్ని ఆద్యంతం థ్రిల్ ఫీల్ అయ్యే సన్నివేశాలతో భూమిక ను తెరకెక్కిస్తున్నాట్లుగా నిర్మాత సుదాన్ తెలిపారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు అఫీషియల్ ఎనౌన్స్ చేస్తామని అన్నారు.
Also Read: వైరల్: కొడుకు కోరిక తీర్చలేక ఏడ్చేసిన అనసూయ..!
తారాగణం
ఐశ్వర్య రాజేశ్
బ్యానర్లు – స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ప్యాషన్ 8 స్టూడియోస్
నిర్మాతలు -కార్తికేయన్ సంతానమ్, సుధాన్ సుందరమ్, జయరామన్
కథ, దర్శకత్వం – రతీంద్రన్ ఆర్ ప్రసాద్