
కల్తీ మద్యం తాగి ముగ్గురు మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లక్ నౌ లోని బంతారా ఏరియాకు చెందిన సుందర్లాల్, అచ్చె, రాజ్ కుమార్ మరో ఇద్దరు కలిసి గురువారం రాత్రి మద్యం తాగారు. సుందర్లాల్, అచ్చె, రాజ్ కుమార్ లు అస్వస్థతకు గురి కావడంతో అసుపత్రికి తరలించారు. వారు చికిత్స పొందుతూ మరణించారు మరో ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టు మార్టం రిపోర్టు చూస్తే వారు కల్తీ మద్యం సేవించడం వల్లేనని తేలింది. ఇక వీరికి కల్లు విక్రయించిన వ్యాపారి పరారయ్యాడు.