https://oktelugu.com/

రానాపై ప్రశంసలు కురిపిస్తున్న మిహికా.. ఎందుకంటే?

‘బాహుబలి’లో భళ్లాలదేవుడిగా రానా అద్భుతంగా నటించి వైరల్డ్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఈ మూవీ తర్వాత వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలనే చేస్తున్నాడు. తాజాగా రానా ‘అరణ్య’ మూవీలో మవాటివాడిగా కన్పించి ఔరా అనిపించాడు. ఢిపరెంట్ పాత్రలు చేస్తూ రానా తనదైన శైలిలో అభిమానులను మెస్మరైజ్ చేస్తున్నాడు. Also Read: సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇది బ్యాడ్ న్యూసే ! రానా ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. కరోనా టైంలోనే మిహీకా బజాజ్ ను పెళ్లి […]

Written By:
  • NARESH
  • , Updated On : November 13, 2020 / 03:59 PM IST
    Follow us on

    ‘బాహుబలి’లో భళ్లాలదేవుడిగా రానా అద్భుతంగా నటించి వైరల్డ్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఈ మూవీ తర్వాత వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలనే చేస్తున్నాడు. తాజాగా రానా ‘అరణ్య’ మూవీలో మవాటివాడిగా కన్పించి ఔరా అనిపించాడు. ఢిపరెంట్ పాత్రలు చేస్తూ రానా తనదైన శైలిలో అభిమానులను మెస్మరైజ్ చేస్తున్నాడు.

    Also Read: సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇది బ్యాడ్ న్యూసే !

    రానా ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. కరోనా టైంలోనే మిహీకా బజాజ్ ను పెళ్లి చేసుకున్నాడు. మిహీకాతో ప్రేమ విషయాన్ని అనౌన్స్ చేసిన నెలరోజుల్లోనే రానా ఆమెను పెళ్లి చేసుకున్న సంగతి తెల్సిందే. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు అప్పట్లో నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా మిహీకా భళ్లలాదేవుడిపై పొగడ్తల వర్షం కురిపించడం ఆసక్తిని రేపుతోంది.

    దగ్గుపాటి రానా తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ స్థాపించి ‘వైఆర్‌యు’ అనే షోని నడిపించబోతున్నాడు. దీనిలో భాగంగా రానా ఎందరో సెలబ్రిటీలను ఈ షోకి తీసుకురానున్నాడు. ఇదిలా ఉంటే హీరో రానా తాజాగా ది అండర్‌టేకర్‌ రెజ్లర్‌తో ఛాట్‌ అద్భుతంగా ఉందంటూ తెలుపుతూ ఓ ఫొటో షేర్‌ చేశాడు.

    Also Read: వైరల్: ‘ఆర్ఆర్ఆర్’ దీపావళి అప్డేట్.. ఫ్యాన్స్ కు పండుగే..!

    అండర్ టేకర్-రానా లైవ్లో మాట్లాడుతుండగా తీసిన ఫొటోను మిహీకా తన ఇన్ స్ట్రాగ్రామ్లో పోస్టు చేయడమే కాకుండా అదిరిపోయే కామెంట్ చేసింది. ‘నా భర్త కూలెస్ట్’ అంటూ ప్రశంసించింది. ఆమె కామెంట్స్ తోపాటు పిక్ ఆకట్టుకునేలా ఉండటంతో అభిమానులు ఈ ఫొటోను వైరల్ చేస్తున్నారు. వీరిద్దరి అనోన్య దంపత్యం ఇలానే కొనసాగాలని అభిమానులు ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్