
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కొద్ది తమిళనాడులో అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడుతున్నది. ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటుండటంతో తమిళ రాజకీయాల్లో వాతావరణం వేడెక్కుతున్నది. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పడి పళనిస్వామి కూడా ప్రతిపక్ష డీఎంకేపై విమర్శలు చేశారు. తమిళనాడు రాజధాని చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన పళనిస్వామి.. గత లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే అసత్య ప్రచారం చేసి గెలిచిందని ఆరోపించారు.