అవిసె గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?

మనలో చాలామంది అవిసె గింజలను తీసుకునే ఉంటారు. కొందరు అవిసె గింజలను ఉలుసులు, మదన గింజలు, అతుశి అనే పేర్లతో పిలుస్తారు. పురాతన ఆహారాలలో ఒకటైన అవిసె గింజలను వైద్యులు, శాస్త్రవేత్తలు సూపర్ ఫుడ్ అని చెబుతారు. ఓమేగా 3 ఫాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండే అవిసె గింజల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పోషక విలువలు పుష్కలంగా ఉండే అవిసె గింజలను రోజూ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అధిక […]

Written By: Navya, Updated On : December 27, 2020 4:33 pm
Follow us on


మనలో చాలామంది అవిసె గింజలను తీసుకునే ఉంటారు. కొందరు అవిసె గింజలను ఉలుసులు, మదన గింజలు, అతుశి అనే పేర్లతో పిలుస్తారు. పురాతన ఆహారాలలో ఒకటైన అవిసె గింజలను వైద్యులు, శాస్త్రవేత్తలు సూపర్ ఫుడ్ అని చెబుతారు. ఓమేగా 3 ఫాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండే అవిసె గింజల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పోషక విలువలు పుష్కలంగా ఉండే అవిసె గింజలను రోజూ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

అధిక బరువుతో బాధ పడేవాళ్లు అవిసె గింజలను నీళ్లలో నానబెట్టి కొంత సమయం తర్వాత తింటే చెడు కొలెస్ట్రాల్ కరిగి సులభంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అవిసె గింజలను ఎండలో పెట్టి ఎండిన గింజలను పొడిలా చేసుకుని కూరలు, పళ్ల రసాలు, లస్సీపై చల్లుకుంటే అవి ఎంతో రుచిగా ఉంటాయి. అవిసె గింజలు హృదయ ఆరోగ్యకరమైన పోషకాలను కలిగి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

మధుమేహం సమస్యతో బాధ పడే వాళ్లు రోజూ అవిసె గింజలను తీసుకుంటే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అవిసె గింజలు ఆకలిని తగ్గించడంతో పాటు తినాలనే కోరికను తగ్గిస్తాయి. శరీరంలో వేడిని తగ్గించడంలో అవిసె గింజలు సహాయపడతాయి. రోజూ అవిసె గింజలను తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అవిసె గింజల్లో క్యానర్లను తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

అవిసె గింజలు జీర్ణ సంబంధిత సమస్యలను, మలబద్ధకం సమస్యను దూరం చేస్తాయి. హార్మోన్ల అసమతుల్యత సమస్యతో బాధ పడే మహిళలు అవిసె గింజలను తీసుకుంటే మంచిది. అవిసె గింజలను వేయించుకుని కూడా తీసుకోవచ్చు. అవిసె గింజలను గాజు సీసాలతో నిల్వ ఉంచితే ఏడాది వరకు పౌష్టిక విలువలు పోకుండా ఉంటాయి.