అఫ్ఘనిస్థాన్ లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాబూల్ లో పరిస్థితి మారిపోతోంది. తాలిబన్లు నగర శివార్లలోకి ప్రవేశించారు. దీంతో అఫ్ఘాన్ రాజధాని వారి కబంధ హస్తాల్లోకి వెళ్లింది. తాలిబన్లు శాంతియుతంగా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని దేశ అధ్యక్షుడి బంగ్లాకు బయలుదేరారు. తాలిబన్ల ప్రతినిధి ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ నేతృత్వంలో తాత్కాలికక ప్రభుత్వానికి అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ పాలన పగ్గాలను స్వచ్ఛందంా అప్పజెప్పినట్లు డెయిలీ న్యూస్ ఈజిప్టు పత్రిక పేర్కొంది.
ప్రతస్తుతం దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అబ్దుల్ సత్తార్ మిర్జక్వాల్ మాట్లాడుతూ అధికార బదలాయింపు శాంతియుతంగా జరిగే అవకాశం ఉందని పేర్కొన్నట్లు టోలో న్యూస్ వెల్లడించింది. దీంతో అఫ్ఘాన్ లో విచిత్రమైన పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. తాలిబన్ల యుద్ధంతో దేశంలో ఎక్కడ చూసిన శాంతి వాతావరణం కనిపించడం లేదు.
ఆదివారం తాలిబన్ నాయకులు మాట్లాడుతూ తాము కాబూల్ ను బలవంతంగా ఆక్రమించే ఉద్దేశం లేదని హామీ ఇచ్చారు. కాబూల్ వాసులు ఎటువంటి భయభ్రాంతులకు గురికావద్దని పేర్కొన్నారు. ప్రతీకారం తీర్చుకోవడానికి నగరంలోని ఆస్తులను ధ్వంసం చేసే ఉద్దేశం తమకు లేదని వారు పలు వార్తా సంస్థలకు వెల్లడించారు.
అన్ని దళాలకు ది ఇస్లామిక్ ఎమిరేట్స్ ఒక విషయం చెబుతోంది. కాబూల్ లోకి ప్రవేశించే మార్గాల వద్దే ఆగిపోండి. ఎవరు నగరంలోకి ప్రవేశించే ప్రయత్నం చేయవద్దు అంటూ తాలిబన్ ప్రతినిధి ట్వీట్ చేశారు. కానీ కొందరు శివార్లలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించారని స్థానికులు చెబుతున్నారు. మరో పక్క రష్యా మాత్రం తన దౌత్య కార్యాలయాన్ని మూసివేసే ఉద్దేశం లేదని పేర్కొంది. ఈ విషయాన్ని రష్యా ప్రతినిధి జమీర్ కబులోవ్ పేర్కొన్నారు.