
టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్స్ లో తడబడుతోంది. నాలుగో రోజు తొలి సెషన్ లో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ భోజన విరామ సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 56 పరుగలే చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్(5), రోహిత్ (21) తో సహా కెప్టెన్ విరాట్ కోహ్లీ (20) విఫలమయ్యాడు. ప్రస్తుతం క్రీజులో పుజారా(3), అజింక్య రహానే (1) ఉన్నారు. ఆశలన్నీ ఇప్పుడు వీరిద్దరిపైనే ఉన్నాయి. కాగా, ఈ సెషన్ లో మొత్తం 25 ఓవర్ల పాటు ఆట సాగగా టీమ్ ఇండియా 56/3 తో కొనసాగుతోంది.