అమెరికా ప్రభుత్వంలో భారతీయులు సత్తా చాటుతున్నారు. నిన్న వెలువడిన అధ్యక్ష ఫలితాల్లో తమిళనాడు సంతతికి చెందిన కమలాహారిస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఢిల్లీకి చెందిన కృష్ణమూర్తి సెనెటర్ గా గెలుపొందారు. తాజాగా అమెరికా ప్రభుత్వంలో టాస్క్ ఫోర్స్ చీఫ్ బాధతలు కూడా భారతీయుడికే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటకకు చెందిన వివేక్ మూర్తి 2014లో అప్పటి అధ్యక్షుడు ఒబామా 19వ సర్జన్ జనరల్ గా నియమితులయ్యారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ప్రజలకు ఎన్నోహమీలను ఇచ్చారు. ముఖ్యంగా కరోనా వ్యాప్తి నివారణకు కొన్ని ప్రణాళికలను వేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ను ఏర్పాచేస్తామన్నారు. అయితే ఈ టాస్క్ ఫోర్స్ చీఫ్ గా వివేక్ మూర్తిని నియమించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. దీంతో అమెరికా ప్రభుత్వంలో మరో భారతీయుడికి అత్యున్నత బాధ్యతలు దక్కే అవకాశం ఉంది.