https://oktelugu.com/

ఇద్దరు జవాన్ల వీర మరణం

జమ్మూ కాశ్మీర్ లో మరోసారి కాల్పుల కలకలం రేపింది. శ్రీనగర్ లోని హెచ్ఎంటీ ప్రాంతంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఇద్దరు జవాన్లు మరణించారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత తొలిసారి ఈనెల 28న జమ్మూకాశ్మీర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. గత కొన్ని రోజులుగా జమ్మూకాశ్మీర్ లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పలు సాగుతున్నాయి. కొన్ని రోజుల కిందట ఉగ్రవాదులు ప్రయాణిస్తున్న వ్యాన్లో తనిఖీలు చేయడంతో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 26, 2020 / 04:56 PM IST
    Follow us on

    జమ్మూ కాశ్మీర్ లో మరోసారి కాల్పుల కలకలం రేపింది. శ్రీనగర్ లోని హెచ్ఎంటీ ప్రాంతంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఇద్దరు జవాన్లు మరణించారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత తొలిసారి ఈనెల 28న జమ్మూకాశ్మీర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. గత కొన్ని రోజులుగా జమ్మూకాశ్మీర్ లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పలు సాగుతున్నాయి. కొన్ని రోజుల కిందట ఉగ్రవాదులు ప్రయాణిస్తున్న వ్యాన్లో తనిఖీలు చేయడంతో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు ఎప్పటికప్పడు అప్రమత్తంగా ఉంటున్నారు. అయితే తాజాగా జరిగిన కాల్పుల్లో ఇద్దరు జవాన్ల మ్రుతితో విషాదం నెలకొంది.