తనకు నచ్చిన వ్యక్తితో వివాహం జరిపించాలని మైనార్టీ తీరని ఓ బాలిక హోర్డింగ్ ఎక్కి కూర్చుంది. తన డిమాండ్ ను నెరవేర్చేదాకా కిందకు రానని పట్టుబట్టింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ పట్టణం పర్దేశిపుర ఏరియాలోని భండారీ బ్రిడ్జ్ ప్రాంతంలో ఓ బాలిక హోర్డింగ్ ఎక్కి హల్ చల్ చేసింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి ఆ బాలికను దించేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె ససేమిరా అనడంతో చివరికి ఆమె చెప్పిన వ్యక్తిని పోలీసులు తీసుకొచ్చారు. దీంతో కిందకు వచ్చిన ఆ బాలిక ఆ వ్యక్తితోనే పెళ్లి చేయాలని, తన తల్లిదండ్రలు ఒప్పుకోకపోవడంతోనే ఇలా హోర్డింగ్ ఎక్కానని పోలీసులకు తెలిపింది.