ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కురిసిన భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో దెబ్బతిన్న పంటలు, ముంపునకు గురైన ప్రాంతాల్లో సోమవారం కేంద్రబృందం పర్యటించింది. వరదల కారణంగా సంభవించిన నష్టాన్ని వివిధ శాఖల ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కేంద్ర బృందానికి వివరించారు. రాష్ట్రంలో 5,583 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని, వాటి ద్వరా రూ.6,368 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. తాత్కాలిక పునరుద్ధరణ కోసం రూ.840 కోట్లు, శాశ్వత పునరుద్ధరణ చర్యలకు రూ.4,439 కోట్లు అందించాలని కోరారు. కాగు సోమవారం కేంద్రబృందం గుంటూరు జిల్లాలోని నష్టపోయిన పంటలను పరిశీలించింది.