ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు బీజేపీ నేతలు మృతి చెందారు. జమ్మూకాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో బీజేవైఎం జిల్లా కార్యదర్శి ఫిదా హుస్సేన్, కమిటీ సభ్యులు ఉమర్ హజాం, ఉమర్ రషీద్ బేగ్ అనే ముగ్గురు నాయకును ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్) కాల్చి చంపింది. ఈ విషయాన్ని సంస్థే స్వయంగా ప్రకటించింది. దీంతో కుల్గాం జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ నేతల కాల్చివేతపై ప్రధాని మోదీ స్పందించారు. ఘటనపై జమ్మూకాశ్మీర్ లెప్టినెంట్ గవర్నర్ మనో సిన్హాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, నేతలు విచారం వ్యక్తం చేశారు.