కోల్ కతా ఆశలపై చెన్నై నీళ్లు.. ప్లే ఆఫ్ రేసు రసవత్తరం!

ఐపీఎల్ 2020 సీజన్ ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో కోల్ కతా గెలుపు దశ నుంచి ఓడిపోయింది. చెన్నైతో జరిగిన మ్యాచ్ చేతుల్లోకి వచ్చి చేజారింది. ఒక్క నో బాల్ కోల్ కతా ప్లే ఆఫ్ ఆశలను నీరు గార్చింది. చెన్నైని విజయానికి చేరువ చేసింది. Also Read: రోహిత్‌ను ఎందుకు పక్కన పెట్టినట్లు..? గురువారం రాత్రి గెలిస్తే ఫ్లే ఆఫ్స్ కు వెళ్లే కోల్ కతా నైట్ రైటర్స్ టీంను […]

Written By: NARESH, Updated On : October 30, 2020 11:02 am
Follow us on

ఐపీఎల్ 2020 సీజన్ ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో కోల్ కతా గెలుపు దశ నుంచి ఓడిపోయింది. చెన్నైతో జరిగిన మ్యాచ్ చేతుల్లోకి వచ్చి చేజారింది. ఒక్క నో బాల్ కోల్ కతా ప్లే ఆఫ్ ఆశలను నీరు గార్చింది. చెన్నైని విజయానికి చేరువ చేసింది.

Also Read: రోహిత్‌ను ఎందుకు పక్కన పెట్టినట్లు..?

గురువారం రాత్రి గెలిస్తే ఫ్లే ఆఫ్స్ కు వెళ్లే కోల్ కతా నైట్ రైటర్స్ టీంను ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు దూరమై ఇంటిబాట పట్టిన చెన్నై గట్టి దెబ్బ కొట్టింది. చెన్నై విజయానికి 12 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన దశలో కోల్ కతా బౌలర్ లూకీ ఫెర్గ్యూసన్ నో బాల్ వేశాడు. దాన్ని చెన్నై బ్యాట్స్ మెన్ రవీంధ్ర జడేజా సిక్సర్ గా మలిచాడు. ఒక్క నో బాల్ తో 9 పరుగులు వచ్చాయి. దీంతో 30 పరుగుల టార్గెట్ కాస్త చివరి ఓవర్ కు వచ్చేసరికి 6 బంతుల్లో 10 పరుగులకు మారిపోయింది. వరుస సిక్సర్లు కొట్టిన జడెజా చెన్నైని గెలిపించి కోల్ కతాను ప్లేఆఫ్స్ కు దూరం చేశఆడు.

ఇప్పటికే ఫ్లే ఆఫ్స్ కు దూరమైన చెన్నై మొండిగా ఆడుతున్న ప్లే ఆఫ్స్ వెళ్లే జట్లను దెబ్బతీస్తోంది. విధ్వంసకారిగా మారుతోంది. ధోని టీం దెబ్బకు ఇప్పుడు ప్లే ఆఫ్ రేసు నుంచి కోల్ కతా దాదాపుగా నిష్క్రమించే పరిస్థితి తలెత్తింది.

ఇప్పటిదాకా ముంబై ఇండియన్స్ 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కు చేరింది. ఇప్పుడు ఓటమితో కోల్ కతా చివరి మ్యాచ్ లో గెలిచినా 14 పాయింట్లతోనే ఉంటుంది. దీంతో ప్లే ఆఫ్ చేరాలంటే మిగిలిన జట్ల గెలుపు ఓటముల మీద ఆధారపడాల్సిన పరిస్తితి ఉంది. పైగా కోల్ కతా రన్ రేట్ మైనస్ లలో ఉండడం పెద్ద అవరోధంగా మారింది.

Also Read: సూర్యకుమార్‌‌ను ఎంపిక చేయరా? బీసీసీఐపై విమర్శలు

ప్రస్తుతం ముంబై ప్లే ఆఫ్స్ కు చేరగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ కేపిటల్స్ 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అవి రెండు మ్యాచ్ లను కలిగి ఉన్నాయి. ఒక్కో మ్యాచ్ గెలిచినా డైరెక్టుగా వెళతాయి. ఇక మరోస్థానం కోసం కింగ్స్ 11 పంజాబ్ ఉంది. అది రెండు మ్యాచ్ లు గెలిస్తే డైరెక్టుగా 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కు చేరుతుంది. ఒక్కటి గెలిస్తే 14 పాయింట్లతో నిలుస్తుంది. అప్పుడు సన్ రైజర్స్, రాజస్థాన్, కోల్ కతాల్లో రన్ రేట్ ఎక్కువగా ఉన్నట్టు ప్లే ఆఫ్స్ కు చేరుతుంది. ఇప్పుడు ప్రతి టీంకు గెలుపు కంపల్సరీ. దీంతో ఇప్పుడు జరిగే మ్యాచ్ లన్నీ డూ ఆర్ డై అన్నట్టే సాగుతాయి. గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్ కు.. ఓడితే ఇంటికే అన్నట్టుగా ఉండనుంది.