
టీమిండియా బౌలర్ నటరాజన్ పై ఆసీస్ క్రికెట్ దిగ్గజం గ్లెన్ మెగ్రాత్ ప్రశంసలు కురిపించాడు. ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా భారత్ నటరాజన్ రూపంలో గొప్ప ఆటగాడు లభించాడంటూ కొనియాడాడు. అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ ఇలాగే ఫామ్‌ను కొనసాగించాలని ఆకాంక్షించాడు.