
సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 10వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన, సభ సమావేశ ఏర్పాట్లను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పర్యవేక్షించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకూడదని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.