Taliban’s : తాలిబన్ల వశమవుతున్న అఫ్ఘానిస్థాన్

అఫ్ఘనిస్థాన్ లో పరిస్థితి అదుపు తప్పింది. ఆ దేశంపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ముందు చూపు లేకపోవడంతో యుద్ధం చేసే ఉద్దేశం లేదని తెలుస్తోంది. దీంతో అగ్రరాజ్య సేనలు అర్థరాత్రి వేళ పెట్టేబేడా సర్దుకోవడంతో అఫ్ఘాన్ సైన్యంలో ధైర్యం లేకుండా పోయింది. వారాల వ్యవధిలో కాందహార్, షెరాత్, లష్కర్ ఘాట్ లతో కలిపి 18 స్టేల్ల రాజధానులను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కాబూల్ కు సమీపంలోని కీలక ప్రాంతాలు తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లాయి. అఫ్ఘాన్ ఆర్థిక మంత్రి […]

Written By: Srinivas, Updated On : August 14, 2021 4:46 pm
Follow us on

అఫ్ఘనిస్థాన్ లో పరిస్థితి అదుపు తప్పింది. ఆ దేశంపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ముందు చూపు లేకపోవడంతో యుద్ధం చేసే ఉద్దేశం లేదని తెలుస్తోంది. దీంతో అగ్రరాజ్య సేనలు అర్థరాత్రి వేళ పెట్టేబేడా సర్దుకోవడంతో అఫ్ఘాన్ సైన్యంలో ధైర్యం లేకుండా పోయింది. వారాల వ్యవధిలో కాందహార్, షెరాత్, లష్కర్ ఘాట్ లతో కలిపి 18 స్టేల్ల రాజధానులను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కాబూల్ కు సమీపంలోని కీలక ప్రాంతాలు తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లాయి. అఫ్ఘాన్ ఆర్థిక మంత్రి ఖలీద్ రాజీనామా చేసి దేశాన్ని వీడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఈ క్రమంలో పాలనాధికారాన్ని తాలిబన్లతో పంచుకునేందుకు కాబూల్ లోని పౌర ప్రభుత్వం అయిష్టంగానే ముందుకొచ్చింది.ఖతార్ లో జరుగుతున్న చర్చల్లో రాజీ సూత్రం ప్రతిపాదించింది. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామాకు పట్టుబట్టిన తాలిబన్ల నుంచి స్పందన రాలేదు. మరోవైపు దేశం మొత్తాన్ని వారం రోజుల్లో హస్తగతం చేసుకుంటామని తాలిబన్లు ప్రకటించారు. వెనక్కి వెళ్లే హడావిడిలో అమెరికా తన ఆయుధ డంపులను అఫ్ఘాన్ లోన వదిలేసింది.

సుల్తాన్ ఖిల్ సైనిక స్థావరంలోని కంటైనర్ల కొద్దీ ఆయుధాలు, వాహనాలు వారి పరమయ్యాయి. కుందూజ్ విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకోవడంతో ఇండియా ఇచ్చిన ఎ:.ఐ. హెలికాప్టర్ తో పాటు అమెరికా స్కాన్ ఈగిల్ డ్రోన్లు సైతం వారి చేతికొచ్చాయి. ఉగ్రమూకలు వ్యూహాత్మకంగానే అప్గాన్ ప్రత్యేక కమెండోలు, పైలెట్లు, అమెరికన్ల దుబాసీలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. సెలవులో ఉన్న పైలెట్లను గుర్తించి హతమారుస్తున్నారు.

అమెరికా తన సహాయక బృందాలను తరలించేందుకు అవసరమైన రవాణా మార్గాల కోసం అఫ్ఘాన్, ఉబ్జెకిస్థాన్, పాకిస్తాన్ లతో కలిసి సరికొత్త క్వాడ్ ను ఏర్పాటు చేసింది. ఇవి కేవలం ముష్కరుల వేగాన్ని తగ్గించడానికి ఉద్దేశించినవే కానీ వారని పూర్తిగా అడ్డుకోవడానికి కాదు. మరో వైపు పౌర ప్రభుత్వానికి ఆదాయం అందకుండా కీలక చెక్ పోస్టులపై తాలిబన్లు పట్టు సాధించారు.

అఫ్ఘాన్ భద్రతా దళాల ప్రస్తుత పరిస్థితి పూర్తిగా నాటి స్వయంకృతమే. దళాల శిక్షణ, ఇతర అవసరాల కోసం అమెరికా 8800 కోట్ల డాలర్లు వెచ్చించింది. అయినా వారిలో పోరాట పటిమ లోపించి, అవినీతి పాతుకుపోయిందని నాటో, అమెరికన్ బలగాల ఉన్నతాధికారులు ఎప్పుడో వాపోయారు. శత్రు ప్రాంతాల్లో గస్తీ సమయాల్లో సైతం మాదక ద్రవ్యాల వినియోగం, అమెరికన్ పరికరాలతో ప్రైవేటు చెక్ పోస్టులు ఏఱ్ాపటు చేసుకుని వసూళ్లకు పాల్పడటం, పరస్పరం కాల్పులు జరుపుకోవడం తదితరులు అఫ్ఘాన్ సిబ్బందికి సాదారణమయ్యాయి.

భారత్ నిర్మించిన సల్మా డ్యామ్ సహా పలు ప్రాజెక్టులపై దాడులు నిర్వహిస్తున్నారు. దీంతో ఇక మారదనే వాస్తవాన్ని ఇండియా గ్రహించింది. ఈ మేరకు తన వైఖరిని ఇటీవల స్పష్టం చేసింది. కాబూల్ పై ఎలాంటి బలవంతపు పాలనను తాము గుర్తించబోమని అమెరికా తో కలిసి ప్రకటించింది. ఐక్య రాజ్య సమితి వేదికగా పాక్ వైఖరిని పరోక్షంగా తప్పుబట్టింది. అఫ్ఘాన్ గడ్డపై నుంచి తన సిబ్బందిని పూర్తిగా వెనక్కి రప్పించే ప్రయత్నాలు చేపడుతోంది.