సుశాంత్‌ బాడీలో విషం లేదు: సీబీఐకి ఏయిమ్స్‌ నివేదిక

సుశాంత్‌ సింగ్‌ శరీరంలో ఎటువంటి విష పదార్థం కనుగొనలేదని ఇండియన్‌ ఇనిస్ట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (ఏయిమ్స్‌) పేర్కొంది. సోమవారం సుశాంత్‌ పోస్టుమార్టం రిపోర్టు మరోసారి పరిశీలించిన ఏయిమ్స్‌ బృందం తాజాగా తన నివేదనిక సీబీఐకి అందించింది. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ జూన్‌ 14న తన ఇంటిలో సూసైడ్‌ చేసుకున్నాడు. అయితే మొదట ఆత్మహత్యే అని అనుకున్నా ఆ తరువాత అనుమానాస్పద మృతి కేసుగా పోలీసులు నమోదు చేసుకొని పలువురిని విచారించారు. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని, […]

Written By: NARESH, Updated On : September 29, 2020 11:44 am

sushant case

Follow us on

సుశాంత్‌ సింగ్‌ శరీరంలో ఎటువంటి విష పదార్థం కనుగొనలేదని ఇండియన్‌ ఇనిస్ట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (ఏయిమ్స్‌) పేర్కొంది. సోమవారం సుశాంత్‌ పోస్టుమార్టం రిపోర్టు మరోసారి పరిశీలించిన ఏయిమ్స్‌ బృందం తాజాగా తన నివేదనిక సీబీఐకి అందించింది. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ జూన్‌ 14న తన ఇంటిలో సూసైడ్‌ చేసుకున్నాడు. అయితే మొదట ఆత్మహత్యే అని అనుకున్నా ఆ తరువాత అనుమానాస్పద మృతి కేసుగా పోలీసులు నమోదు చేసుకొని పలువురిని విచారించారు. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని, హత్యేనని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ కేసును సీబీఐ విచారణ చేస్తోంది. మరోవైపు కూపర్‌ ఆసుపత్రికి క్లీన్‌చిట్‌ ఇంకా ఇవ్వలేదు. ఆ హాస్పిటల్‌ పోస్టమార్టం నివేదికను పరిశీలించాల్సి ఉందని, తుది నివేదిక కోసం చట్టపరమైన విధానాలను చూడాల్సి ఉందని వైద్య బృందం చైర్మన్‌ డాక్టర్‌ సుదీర్‌గుప్తా అన్నారు.