వన్డేల్లో ఓడి.. టీట్వంటీలో గెలిచిన టీమిండియా ఆస్ట్రేలియాతో సుధీర్గ టెస్టు సిరీస్ కు రెడీ అయ్యింది. డిసెంబర్ 17నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఆడిలైడ్ వేదికగా గురువారం ఉదయం డే అండ్ నైట్ తొలి టెస్టు ప్రారంభం కానుంది.
Also Read: అదిరిపోయే ట్వీస్ట్.. యువీ రిటైర్మెంట్ వాపస్..!
ఈ టెస్టు మ్యాచ్ కోసం ఒకరోజు ముందే బీసీసీఐ తుదిజట్టును ప్రకటించింది. మ్యాచుకు ఒక రోజు ముందు ఇలా జట్టును ప్రకటించడం గత ఏడాది నుంచి ఆరంభమైంది. దాన్ని బీసీసీఐ కొనసాగిస్తోంది.
తొలి టెస్టులో ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, ఫృథ్వీ షాలకు టీమిండియా మేనేజ్ మెంట్ చోటు ఇచ్చింది. ఇక ప్రాక్టీస్ మ్యాచ్ లో రాణించని ఫృథ్వీ షాను తీసుకొని రాణించిన శుభమన్ గిల్ లను పక్కనపెట్టడం విశేషంగా మారింది. ఫృథ్వీ దూకుడు అసీస్ పిచ్ లపై లాభిస్తుందని అనుకుంటున్నారు.
Also Read: క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్.. 2022 ప్రపంచ కప్ షెడ్యూల్ వచ్చేసింది..!
ఇక మూడోస్థానంలో పూజారా ఆ తర్వాత వైస్ కెప్టెన్ రహానె, కెప్టెన్ కోహ్లీలు రానున్నారు. ఇక ప్రాక్టీస్ మ్యాచ్ లో దంచికొట్టిన రిషబ్ పంత్ ను పక్కన పెట్టి సీనియర్ వృద్ధిమాన్ సాహాను కీపర్ గా టీమిండియా మేనేజ్ మెంట్ ఎంపిక చేసింది. మిడిల్ ఆర్డర్ లో తెలుగు క్రీడాకారుడు హనుమవిహారి సీటు ఖాయం చేసుకున్నారు.
స్పిన్నర్ కోటాలో రవీంద్ర జడేజాకు బదులుగా అశ్విన్ కు అవకాశం ఇచ్చారు. విహారి పార్ట్ టైం స్పిన్నర్ గా చేయనున్నాడు. ప్రస్తుతానికి బీసీసీఐ ఈ 11లో పంత్ , జడేజాలకు ఈసారి షాక్ ఇచ్చింది. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన కేఎల్ రాహుల్ ను కూడా పరిగణలోకి తీసుకోలేదు.
UPDATE🚨: Here’s #TeamIndia’s playing XI for the first Border-Gavaskar Test against Australia starting tomorrow in Adelaide. #AUSvIND pic.twitter.com/WbVRWrhqwi
— BCCI (@BCCI) December 16, 2020