ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో నిర్మిస్తున్న ‘సెంట్రల్ విస్టా’కు సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది. మంగళవారం జరిగిన విచారణలో ‘కొత్త పార్లమెంట్ భవన సముదాయం అనుమతుల విషయంలో బలహీనతలు లేదు. భూ వినియోగంలో మార్పు లేదని మేం భావిస్తున్నాం‘ అని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తెలిపింది. భారత పార్లమెంట్ భవన సముదాయాన్ని విస్తరించడానికి గతేడాది డిసెంబర్ 7న సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేశారు. అయితే పర్యావరణ అనుమతులపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన విచారణలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొంది.