Homeజాతీయం - అంతర్జాతీయంTana Food Drive: తానా సూపర్ సక్సెస్ ఫుల్ ఫుడ్ డ్రైవ్

Tana Food Drive: తానా సూపర్ సక్సెస్ ఫుల్ ఫుడ్ డ్రైవ్

Tana Food Drive: సమాజం లో చాలామందికి ప్రతి రోజు భోజనం దొరక్క అలమటిస్తున్నారు. అందుకే అలాంటి వారి కోసం అన్నదానం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వృద్ధులు, చిన్న పిల్లల కోసం అనాథ ఆశ్రమాల్లోని వారికి భోజనం సమకూర్చేందుకు ఫుడ్ డ్రైవ్ లాంటివి నిర్వహించాల్సిన అవసరం ఉంది. అందుకే అసహాయుల కోసం అప్పుడప్పుడు TANA అమెరికాలోనూ ఇలాంటి డ్రైవ్ లు నిర్వహించటం జరుగుతోంది .

Tana Food Drive
Tana Food Drive

తానా మహిళా సేవల కో-ఆర్డినేటర్ డాక్టర్ ఉమా అరమాండ్ల కటికి నేతృత్వంలో చికాగోలో ‘తానా సూపర్ సక్సెస్ ఫుల్ ఫుడ్ డ్రైవ్’ నిర్వహించారు. ఈ ఫుడ్ డ్రైవ్ కోసం విరాళాలు సేకరించబడ్డాయి. పాడైపోని ఆహార పదార్థాలు, మందులు.. ఇతర వస్తువులను అరోరాలోని నిరాశ్రయులైన హెస్డ్ హౌస్‌కు విరాళంగా అందించారు, మౌంట్ ప్రాస్పెక్ట్ లోని మహిళా ఆశ్రయానికి ఆహారం.. చెక్కును విరాళంగా అందించారు.

Tana Food Drive
Tana Food Drive

ఈ ఫుడ్ డ్రైవ్ కు మద్దతు ఇచ్చినందుకు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావుకి డా .ఉమా కటికి ధన్యవాదాలు తెలిపారు . విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికీ, నిరుపేదల పట్ల కరుణ చూపిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫుడ్ డ్రైవ్‌కు మద్దతు ఇచ్చిన వాలంటీర్లందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Tana Food Drive
Tana Food Drive

హేమ అద్దంకి, సంధ్యా అద్దంకి, మైథిలి పిట్టల, గురుప్రీత్ సింగ్, శ్రీదేవి దొంతి, శ్రీలత గరికపాటి, వేణి సనక్కాయల, భాగ్యలక్ష్మి, శాంతి లక్కంసాని, కిరణ్ వంకాయలపాటి, సునీత రాచపల్లి, శ్రీదేవి మల్లంపల్లి, గౌరీశ్రీ, సత్య శ్రీ, పద్మ మాదాల, శ్రీలత ఏరామతి
సహాయం చేశారు. ఫుడ్ డ్రైవ్‌కు విరాళాలు అందించారు.

Tana Food Drive
Tana Food Drive
Tana Food Drive
Tana Food Drive

 

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version