భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ.. ఐటీ, బ్యాంక్స్ తదితర స్టాక్‌లు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో.. సెన్సెక్స్ 81 పాయింట్లు నష్టపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 80.74 పాయింట్లు (0.17 శాతం) నష్టపోయి 48,093.32 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 8.90 పాయింట్లు (0.06 శాతం) నష్టపోయి 14,137.35 వద్ద క్లోజ్ అయ్యింది. సెన్సెక్స్‌లో టైటాన్ 2 శాతం మేర అత్యధికంగా నష్టపోగా తర్వాతి స్థానాల్లో నెస్లే ఇండియా, హెచ్‌యుఎల్, హెచ్‌సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఐటిసి, కొటాక్ బ్యాంక్ తదితర షేర్లు ఉన్నాయి. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్, ఇండస్ ఇండ్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫైన్ సర్వ్, ఎల్‌అండ్‌టీ తదితర షేర్లు లాభాలతో ముగిశాయి.