https://oktelugu.com/

అఖిలప్రియ విజ్ఞప్తి తిరస్కరణ

మెరుగైన వైద్యం కోసం తనను ఆస్పత్రికి తరలించాలన్న అఖిలప్రియ విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో ఏ1గా ఉన్న ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియను పోలీసులు బుధవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ కండ్లు తిరిగి పడిపోయిందని బంధువులు వెల్లడించారు. వైద్య పరీక్షల పూర్తి అనంతరం జడ్జి ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌ను విధించారు. నేటి బెయిల్‌ విచారణ సందర్భంగా మెరుగైన వైద్యం కోసం […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : January 7, 2021 / 06:13 PM IST
    Follow us on

    మెరుగైన వైద్యం కోసం తనను ఆస్పత్రికి తరలించాలన్న అఖిలప్రియ విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో ఏ1గా ఉన్న ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియను పోలీసులు బుధవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ కండ్లు తిరిగి పడిపోయిందని బంధువులు వెల్లడించారు. వైద్య పరీక్షల పూర్తి అనంతరం జడ్జి ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌ను విధించారు. నేటి బెయిల్‌ విచారణ సందర్భంగా మెరుగైన వైద్యం కోసం తనను ఆస్పత్రికి తరలించాలని అఖిలప్రియ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.