కమల్ నాథ్ కు సుప్రీం ఊరట..

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కు సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. స్టార్ క్యాంపెయిన్ గా ఆయన హోదాను ఎన్నికల సంఘం రద్దు చేయగా సుప్రీం స్టే విధించింది. ఎన్నికల ప్రచాంలో భాగంగా అక్టోబర్ 13న సీఎం శివరాజ్ సింగ్ పై చేసిన వ్యాఖ్యలు, అక్టోబర్ 18న బీజేపీ అభ్యర్థి ఇమర్తి దేవిపై చేసిన వాఖ్యలపై ఈసీ సీరియస్ అయింది. దీంతో కమల్ నాథ్ ను స్టార్ ప్రచారకుడిగా హోదాను తప్పిస్తున్నట్లు అక్టోబర్ 30న ఎన్నికల కమిషన్ […]

Written By: Suresh, Updated On : November 2, 2020 3:09 pm
Follow us on

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కు సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. స్టార్ క్యాంపెయిన్ గా ఆయన హోదాను ఎన్నికల సంఘం రద్దు చేయగా సుప్రీం స్టే విధించింది. ఎన్నికల ప్రచాంలో భాగంగా అక్టోబర్ 13న సీఎం శివరాజ్ సింగ్ పై చేసిన వ్యాఖ్యలు, అక్టోబర్ 18న బీజేపీ అభ్యర్థి ఇమర్తి దేవిపై చేసిన వాఖ్యలపై ఈసీ సీరియస్ అయింది. దీంతో కమల్ నాథ్ ను స్టార్ ప్రచారకుడిగా హోదాను తప్పిస్తున్నట్లు అక్టోబర్ 30న ఎన్నికల కమిషన్ పేర్కొంది. దీనిపై కమల్ నాథ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే నేత్రత్వంలో త్రిసభ్య కమిటి ఆయన పిటిషన్ ను విచారించింది. కమలనాథ్ తరుపున న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ఎన్నికల కమిషన్ తరుపున రాకేశ్ ద్వివేది హాజరయ్యారు. ఇరువురి వాదనలు విన్న సుప్రీంకోర్టు కమలనాథ్ స్టార్ క్యాంపెయిన్ హోదాను రద్దు చేసే అధికారి ఈసీకి లేదని తెలిపింది.