
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై టీపీసీసీ ఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ కన్వీనర్ నిరంజన్ కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ దుబ్బాకకు వెళ్లకుండా పక్క జిల్లాలో ప్రారంభోత్సవాల పేరిట ఓటర్లను ప్రభావితం చేశారన్నారు. గత నెల 29న మల్కాజిగిరిలోని మూడుచింతల గ్రామంలో బహిరంగ సభను ఏర్పాటు చేసి ధరణి పోర్టల్ ను ప్రారంభించారన్నారు. అంతేకాకుండా సాదాబైనామాలను రెగ్యులరైజ్ చేసుకోవడానికి మరో వారం రోజుల పాటు గుడువు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ సభల ద్వారా ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నించారని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాకు లేఖ రాశారు.