పంజాబ్ లోని స్వర్ణ దేవాలయంలో సోమవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గురునానక్ 551వ జయంతి సందర్భంగా సిక్కులు ఆలయంలోకి భారీగా తరలివచ్చారు. దేవాలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించారు. విద్యుత్ వెలుగులతో స్వర్ణ దేవాలయం కాంతులీనింది. గురునానక్ జయంతి సందర్భంగా రాష్ర్టపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. గురునానక్ సమాజసేవే ధ్యేయంగా ప్రజలను ముందు నడిపించారని మోదీ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఐక్యత, సామరస్యం, సేవా మార్గాన్ని చూపించడంతో పాటు ఆత్మాభిమానాన్ని చూపారన్నారు. కాగా దేశంలోని పలు సిక్కు ఆలయాల్లో గురునానక్ జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు.