https://oktelugu.com/

తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ’కార్తీక‘ పూజలు

కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం గోదావరి, కృష్ణ నది తీరాలు, ఆలయాలు భక్తులతో కిటకిట లాడాయి. తెలుగు రాష్ట్రాల్లోని గోదావరి, కృష్ణ నది తీరాల్లో భక్తులు ఉదయమే వెళ్లి పుణ్య స్నానాలు చేశారు. అనంతరం ఆలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకున్నారు. తెలంగాణలోని ధర్మపురి, కోటి లింగాల వద్ద ఉన్న గోదావరి తీరంలో భక్తులు అధికంగా కనిపించారు.  సోమవారం ఉదయం నుంచే దీపాలను వెలిగించి నదిలోకి వదిలారు. భధ్రాచలం గోదావరి వద్ద భక్తులు ఒకరోజు ముందే వచ్చారు. సోమవారం […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 30, 2020 / 10:14 AM IST
    Follow us on

    కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం గోదావరి, కృష్ణ నది తీరాలు, ఆలయాలు భక్తులతో కిటకిట లాడాయి. తెలుగు రాష్ట్రాల్లోని గోదావరి, కృష్ణ నది తీరాల్లో భక్తులు ఉదయమే వెళ్లి పుణ్య స్నానాలు చేశారు. అనంతరం ఆలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకున్నారు. తెలంగాణలోని ధర్మపురి, కోటి లింగాల వద్ద ఉన్న గోదావరి తీరంలో భక్తులు అధికంగా కనిపించారు.  సోమవారం ఉదయం నుంచే దీపాలను వెలిగించి నదిలోకి వదిలారు. భధ్రాచలం గోదావరి వద్ద భక్తులు ఒకరోజు ముందే వచ్చారు. సోమవారం పొద్దున్నే లేచి  నదీ స్నానాలు చేసి కార్తీక దీపాలను వదిలారు. అనంతరం రాములోరి ఆలయంలో దీపాలను వెలిగించారు. అలాగే ఆంధ్రప్రేదేశ్ లోని శ్రీశైలం సమీపంలో ఉన్న పాతాత గంగలో భక్తులు కార్తీక దీపాలను వదిలారు. ఇక శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఆలయంలో భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించారు.