
భక్తి ఉద్యమ పునరుద్ధరణతో అసోంలోని గ్రామాల్లో సామాజిక పరివర్తన తీసుకువస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. తద్వారా యువత ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోతారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని సంప్రదాయ వైష్ణవ మఠాల్లోని నమ్‌ఘర్లకు కేంద్రం ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. ఒక్కొక్కరికి రెండున్నర లక్షల రూపాయల చొప్పున మొత్తంగా 8 వేల మందికి లబ్ది చేకూరుతుందని పేర్కొన్నారు.