వాహనాలపై ఆ పేర్లు ఉంటే సీజ్

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాలపై కులం పేరు ఉండొద్దన్న ప్రధానమంత్రి కార్యాయలం(పీఎంవో) ఆదేశాలను యూపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై వాహనాలపై కులాలు, జాతుల పేర్లు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. ఏ వాహనంపైనైనా ఇలాంటివికి కనబడితే వెంటనే వాటిని సీజ్ చేయాలని పేర్కొంది. గతంలో ముంబైకి చెందిన ఉపాధ్యాయుడు హర్షల్ ప్రభు వాహనాలపై కులం, జాతి పేరు ఉంటే ఉద్రిక్తలు చోటు చేసుకుంటున్నాయని ప్రధానమంత్రి కార్యాలయానికి తెలిపారు. […]

Written By: Suresh, Updated On : December 27, 2020 11:10 am
Follow us on

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాలపై కులం పేరు ఉండొద్దన్న ప్రధానమంత్రి కార్యాయలం(పీఎంవో) ఆదేశాలను యూపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై వాహనాలపై కులాలు, జాతుల పేర్లు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. ఏ వాహనంపైనైనా ఇలాంటివికి కనబడితే వెంటనే వాటిని సీజ్ చేయాలని పేర్కొంది. గతంలో ముంబైకి చెందిన ఉపాధ్యాయుడు హర్షల్ ప్రభు వాహనాలపై కులం, జాతి పేరు ఉంటే ఉద్రిక్తలు చోటు చేసుకుంటున్నాయని ప్రధానమంత్రి కార్యాలయానికి తెలిపారు. దీంతో మనుషుల మధ్య వ్యత్యాసాలు ఏర్పడి సామాజిక దూరం ఉండే ప్రమాదం ఉందని తెలిపారు. ఆయన ఫిర్యాదును ప్రధానమంత్రి కార్యాలయం యూపీ ప్రభుత్వానికి పంపింది. వెంటనే స్పందించిన యూపీ అదనపు రవాణా కమిషనర్ ముఖేశ్ చంద్ర వాహనాలపై కులం, జాతి పేర్లు ఉండొద్దని ఆదేశాలు జారీ చేశారు.