
భారత్ ఇటీవల ఆమోదించిన కరోనా వ్యాక్సిన్లపై ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసల జల్లు కురుస్తున్నాయి. కోవిడ్ కట్టడికి భారత్ తీసుకుంటున్న చర్యలపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్ వో) చీఫ్ టెడ్రోస్ అథనామ్ భేష్ అని కొనియాడారు. కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి విషయంలో మిగతా దేశాల కంటే భారత్ ముందుందని చెప్పారు. డబ్ల్యూహెచ్ వోతో కలిసి భారత్ ముందుకు సాగితే మరింత ప్రభావంతమైన వ్యాక్సిన్లను తయారు చేయవచ్చని అన్నారు. మరోవైపు భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ పై బిల్ గేట్స్ ప్రశంసలు గుప్పించారు. శాస్త్రీయ ఆవిష్కరణల్లో భారత్ మెరుగు స్థానంలో ఉందన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ లో బిల్ గేట్స్ పేర్కొన్నారు.