అమెరికా ఎన్నికల్లో అధ్యక్షుడిగా డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలాహారిస్ ఎన్నికయ్యారు. కమలాహారిస్ అమ్మమ్మ ఊరు తమిళనాడు రాష్ట్రంలో ఉంది. కమల గెలుపుతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కమల హారిస్ మేనమామ, భారత్, అమెరికా సంబంధాల నిపుణుడు గోలాన్ బాలచంద్రన్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్ చేసే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్తానని ఆయన తెలిపారు. తాము కమలా హారిస్ ను చిన్నప్పటి నుంచి ప్రోత్సహించామని, ఆయన పేర్కొన్నారు. కమలాహ్యారిస్ ఎక్కడా పొరపాట్లు చేయకుండా చక్కని పనితీరుతో ఈ స్థాయికి చేరుకుందన్నారు. కమల గెలుపును ముందే ఊహించామన్నారు.