మరోసారి భారత్, చైనాల మధ్య చర్చలు: కేంద్రప్రభుత్వం

తూర్పు లద్దాఖ్ నుంచి సైనిక బలగాల ఉపసంహరణపై భారత్, చైనాల మధ్య జరిగిన ఎనిమిదో రౌండ్ చర్చల్లో ఎలాంటి పురోగతి సాధించలేదు. ఈనేపథ్యంలో మరో రౌండ్ చర్చలు ఉంటాయని కేంద్రప్రభుత్వం ఆదివారం తెలిపింది. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న చర్చలతో ఎలాంటి పరిష్కారం లభించలేదు. అందువల్ల మరోసారి చర్చలు నిర్వహించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని కేంద్రప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలో పేర్కొంది. కాగా ఎనిమిదో రౌండ్ చర్చలు కమాండ్ స్థాయిలో జరిగాయి. భారత బృందానికి లెప్టినెంట్ జనరల్ […]

Written By: Suresh, Updated On : November 8, 2020 1:53 pm

india win on china

Follow us on

తూర్పు లద్దాఖ్ నుంచి సైనిక బలగాల ఉపసంహరణపై భారత్, చైనాల మధ్య జరిగిన ఎనిమిదో రౌండ్ చర్చల్లో ఎలాంటి పురోగతి సాధించలేదు. ఈనేపథ్యంలో మరో రౌండ్ చర్చలు ఉంటాయని కేంద్రప్రభుత్వం ఆదివారం తెలిపింది. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న చర్చలతో ఎలాంటి పరిష్కారం లభించలేదు. అందువల్ల మరోసారి చర్చలు నిర్వహించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని కేంద్రప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలో పేర్కొంది. కాగా ఎనిమిదో రౌండ్ చర్చలు కమాండ్ స్థాయిలో జరిగాయి. భారత బృందానికి లెప్టినెంట్ జనరల్ పీజీకే మీనన్ నేత త్వం వహించారు.