
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌పై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. హోటల్‌లో లభించే ఉచిత పానీయాలు తాగి తందాన చేయడానికే మాక్స్‌వెల్ ఐపిఎల్ ఆడుతున్నాడని ఘాటుగా విమర్శించాడు. ఐపిఎల్ అతనికి పారితోషికం తీసుకొనే ఒక విహారయాత్రగా మారిందన్నాడు. ఈ సీజన్ ఐపిఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున బరిలోకి దిగిన మ్యాక్సీ ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. విధ్వంసకర ఆటగాడైన ఈ ఆసీస్ ఆటగాడు కనీసం ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాడు.