మనకు అవసరమున్నప్పుడు దగ్గరకు చేరి.. అవసరం లేనప్పుడు హ్యాండ్ ఇవ్వడం రాజకీయంలో కామన్ విషయమే.. అయితే దేశంలో ప్రస్తుతం మోడీ హవా సాగుతోంది. తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండడమే కాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయకుండా జాగ్రత్తపడడమే ఆయన నైజం. అలాంటి వ్యక్తిని ఢీకొట్టాలంటే పెద్ద స్ట్రాటజీ ఉండాలి.. మోడీ విధానాలు నచ్చక ఆయనతో పోరాడుతున్నవారిలో కేజ్రీవాల్, మమతా బెనర్జీ, స్టాలిన్ తదితరులు ఉన్నారు. వారిలో కేసీఆర్ కూడా చేరిపోయారు. అయితే మొన్నటి వరకు మోడీకి విధేయుడిగా ఉన్న జగన్ ఇటీవల రైతులు తలపెట్టిన బంద్ లో జగన్ పరోక్షంగా విజయవంతం చేశాడని తెలుస్తోంది.
Also Read: ఏమ్మా రేవతి.. అధికారం ‘చేతి’లో ఉంటే లాగిపెట్టి కొట్టొచ్చా?
పోలవరం ప్రాజెక్టు, ఇతర అవసరాల నిమిత్తం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అప్పుడప్పుడూ కేంద్ర బీజేపీతో మంతనాలు సాగిస్తు వస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, అమిత్ షా లాంటి వారిని పదే పదే కలుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మోడీకి జగన్ మద్దతుదారుడే అనే ముద్ర పడిపోయింది. అంతేకాకుండా కేంద్రం వ్యవసాయ బిల్లును ప్రవేశపెట్టినప్పడు వైసీపీ ఎంపీలు బీజేపీకే ఓటు వేశారు. కేంద్ర వ్యవసాయంలో నూతన చట్టాలు తీసుకు రావడం సబబే అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.
మరోవైపు రైతులు ఆ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈనెల 8న బంద్ తలపెట్టారు. ఈ బంద్ లో వామపక్షాలతో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ పాల్గొన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో మోడీకి మద్దతు దారుగా ఉన్న జగన్ బంద్ ను విజయవంతం చేశారని అంటున్నారు. అయితే దానికి పలు కారణాలు కూడా లేకపోలేదన చర్చించుకుంటున్నారు.
Also Read: ఏలూరులో మరణమృదంగం.. మరో ఇద్దరు మృతి.. కారణమేంటి?
మోడీ పట్ల జగన్ నకు ఎంత విధేయత ఉన్న రాష్ట్రానికొచ్చేసరికి కేంద్ర పట్టించుకోవడం లేదనే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు తెలంగాణలో బీజేపీ బలపడుతుండడంతో ఏపీలోనూ నాయకుుల దూకుడు పెంచుతున్నారు. ప్రతీ ఆందోళనలోనూ ప్రత్యక్షంగా పాల్గొంటూ తమ ప్రతిష్టతను నిలుపుకుంటున్నారు. ఇక తిరుపతి ఉప ఎన్నికలోనూ బీజేపీ, జనసేనలు కలిసి అభ్యర్థిని నిలబెడుతున్నారు. ఈ నేపథ్యంలో మోడీకి వ్యతిరేకంగా నిలిస్తేనే బెటరని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మోడీ లాంటి వ్యక్తితో ఢీకొనాలంటే స్ట్రాటజీ ఉండాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్