భారత్ కు చెందిన స్కార్పీన్ క్లాస్ వాగిర్ అరేబియా సముద్రంలో జల ప్రవేశం చేసింది. గురువారం రక్షణశాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో నిర్మిస్తున్న ఆరు కల్వరీ క్లాస్ జలాంతార్గముల్లో ఇది ఐదవది. దీనిని ఫ్రెంచ్ నావికాదళ రక్షణ, ఇంధన సంస్థ డీసీఎన్ఎస్ రూపొందించిన జలాంతర్గములను భారత నావికాదళం ప్రాజెక్టు-75లో భాగంగా ముంబైలోని మజగాన్ డాక్ లిమిటెడ్ నిర్మించింది. ఆరు స్కర్పీన్ క్లాస్ జలాంతర్గముల్లో మొదటిదాన్ని 2017 డిసెంబర్లో ప్రవేశపెట్టారు.