https://oktelugu.com/

అక్షయ్ ‘లక్ష్మీ’ డిజాస్టర్ టాక్.. రికార్డు వ్యూస్.. కారణమేంటి?

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘లక్ష్మీ’ మూవీ ఈనెల 9న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్లో విడుదలైంది. టాలీవుడ్లో సూపర్ హిట్టు సాధించిన ‘కాంచన’ బాలీవుడ్లో ‘లక్ష్మీ’గా హిందీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఓటీటీల్లో రిలీజైన అన్ని సినిమాల మాదిరిగానే ఈ మూవీ కూడా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే రికార్డు వ్యూస్ సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. Also Read: తొలి అనుభవం.. రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర కామెంట్స్ అక్షయ్ కుమార్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 12, 2020 / 12:13 PM IST
    Follow us on

    laxmi bomb

    బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘లక్ష్మీ’ మూవీ ఈనెల 9న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్లో విడుదలైంది. టాలీవుడ్లో సూపర్ హిట్టు సాధించిన ‘కాంచన’ బాలీవుడ్లో ‘లక్ష్మీ’గా హిందీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఓటీటీల్లో రిలీజైన అన్ని సినిమాల మాదిరిగానే ఈ మూవీ కూడా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే రికార్డు వ్యూస్ సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

    Also Read: తొలి అనుభవం.. రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర కామెంట్స్

    అక్షయ్ కుమార్ మ్యాజిక్ ‘లక్ష్మీ’ మూవీకి బాగా కలిసొచ్చినట్లు కన్పిస్తోంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ‘లక్ష్మీ’ ప్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రికార్డు వ్యూస్ సాధించి ఔరా అనిపిస్తోంది. ఇండియాలోనే అత్యధిక వ్యూస్ సాధించిన చిత్రంగా ‘లక్ష్మీ’ మూవీ సరికొత్త రికార్డును సృష్టించింది.

    ‘లక్ష్మీ’ మూవీ విడుదలైన 24గంటల్లో 200మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ మూవీ కంటే ముందు అత్యధిక వ్యూస్ సాధించిన రికార్డు సుశాంత్ సింగ్ చివరి సినిమా ‘దిల్ బెచారా’(95మిలియన్ వ్యూస్) పేరిట ఉండేది. విడుదలైన రోజు నుంచి ప్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అక్షయ్ క్రేజ్ కారణంగానే ఈమూవీ రికార్డు వ్యూస్ సాధించినట్లు తెలుస్తోంది.

    Also Read: రివ్యూ: ‘ఆకాశం నీ హద్దురా’ హిట్టా? ఫ్లాపా?

    బాలీవుడ్లో అక్షయ్ కుమార్ ప్లాప్ సినిమాలే మినిమం వందకోట్ల కనెక్షన్లు రాబడుతాయి. ఆ ట్రెండునే ఓటీటీలో‘లక్ష్మీ’ కంటిన్యూ చేసినట్లు కన్పిస్తోంది. రికార్డు వ్యూస్ ను థియేటర్ల టికెట్ సేల్స్ ప్రకారం చూస్తే తొలిరోజే వెయ్యి కోట్లతో సమానమనే టాక్ విన్పిస్తోంది. ఈ మూవీని డాన్స్ మాస్టర్ కమ్ హీరో రాఘవ లారెన్స్ తెరక్కించగా కియారా అడ్వాణీ హీరోయిన్ గా నటించింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్